ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఎం.ఈ.ఓ "జగనన్న గోరుముద్ద" కార్యక్రమం నిరంతర పర్యవేక్షణ ఉండాలి. -జిల్లా కలెక్టర్ బసంత కుమార్. టాయిలెట్లు మరమ్మత్తు పనులు చేపట్టాలి. పిల్లలకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలి. ప్రతి ఎంఈఓ కు జగనన్న గోరుముద్ద కార్యక్రమం నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు .స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో నాడు -నేడు పనులపై జిల్లా డీఈఓ ఆధ్వర్యంలో, ఎం ఈ ఓ ల తో, ఎం ఆర్ సి ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ మీనాక్షి, ఎస్ సి . ఈ.ఆర్ అండ్ బి గోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ సి ఈ రషీద్, సర్వ శిక్ష అభియాన్ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాడు- నేడు పనులలో సంబంధిత శాఖ అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేవిధంగా కృషి చేయాలని తెలిపారు. కచ్చితంగా స్కూల్లో వివిధ పనుల్లో ఎలా అమలు అవుతున్నాయి వాటిని నిరంతరం ఎమ్ ఈ ఓ లు, మరియు ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అందిస్తున్న భోజనం అధ్వానంగా ఉంటుందని తల్లిదండ్రుల నుండి నిత్యం ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుందని తెలిపారు వస్తుంటాయి. ఆయా మండల విద్యాశాఖ అధికారులందరూ ఆయా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య అధికప్రాధాన్యత ఇస్తూ ఉన్నదని తెలిపారు. ప్రతి ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను చదివించాలని తెలిపారు. విలీనం ఆయన పాఠశాలలో ఒకే తరగతి లో వివిధ తరగతుల విద్యార్థుల ఉండడం మంచి పద్ధతి కాదు, వారిని ప్రత్యేక తరగతులు బోధన పద్ధతులు చేపట్టాలని తెలిపారు. త్వరలో టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది తెలిపారు. ఇటీవల క్షేత్రస్థాయిలో నేను వెళ్ళినప్పుడు స్కూళ్లలో నేను కూడా క్షేత్రస్థాయిలో గోరుముద్ద తింటున్నాను. కేజీ బివి లో చాలా బాగుందన్నారు. అయితే అన్ని పాఠశాలలో పిల్లలకు సన్నబియ్యం తోనే భోజనం అందించాలని విద్యా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఎక్కడ నిరుపయోగంగా ఉండకూడదు. వెంటనే మరమ్మతులు చేసి విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాలని తెలిపారు ఏక్కడ కూడా తప్పులు జరగకుండా చూడాలని తెలిపారు. మీ పర్యవేక్షణలో నాడు నేడు పనులలో నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చిలమత్తూరు మండలం లో గొల్లపల్లి నందు ప్రాథమిక పాఠశాలకు టాయిలెట్ కొరకు స్థల సేకరణ రెండు రోజుల లోపల పూర్తిచేయాలని అందుకు సంబంధిత ఎంపీడీవో తాసిల్దారు ఎం ఈ వో డిఇఓ పర్యవేక్షణలో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విద్యా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ లో స్కూల్ తెరిచే నాటికి విద్య కానుక కింద అన్ని రకాల వస్తువులు విద్యార్థులకు అందించాలి. నాడు నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూలు పై నిరంతరం ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించి వలసిన బాధ్యత విద్యాశాఖ అధికారుల పై ఉన్నదని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎవరైనా ఫోన్ చేసిన సమాధానం ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ లు, ఎం ఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin