సర్కార్ టీవీ న్యూస్ / యన్.టి.ఆర్ జిల్లా : సెప్టెంబరు.14 : జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద భారీ గా గంజాయి పట్టివేత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆంధ్ర తెలంగాణ బోర్డ ర్ జీలుగుమిల్లి ఆంధ్ర చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్. ఆధ్వర్యంలోవాహనాలు తనిఖీ చేస్తుండగా, భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు 750 కేజీలు గంజాయిని ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి నుండి మహారాష్ట్ర తరలిస్తుండగా ఆంధ్ర చెక్ పోస్ట్ జీలుగుమిల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు పట్టుపడ్డారు. కొబ్బరి మొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ లో ఈ గంజాయిని పట్టుకున్నారు, ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డ్రైవర్ మరియు క్లీనర్ ని వ్యా న్ ని స్టేషన్ కి తరలించారు. గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
-----------------------
Admin