సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము స్థానిక వ్యవసాయ కార్యాలయంలో అగ్రి అడ్వాయిజరీ బోర్డు ఛైర్మన్ లక్ష్మీపతి రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏ ఓ ఇలియాజ్ అహమ్మద్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యనారాయణ హాజరయ్యారు. సత్యనారాయణ మాట్లాడుతూ వేరుశనగ రాయితీ విత్తనాన్ని, రైతులు సర్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వేరుశనగ పంటలో ఏడు సాలల్లో అంతరపంటగా ఒక సాలు కందిని విత్తితే రైతులకు లాభసాటిగా వుంటుందని సూచించారు. ఈ సంవత్సరం 2023 అంతర్జాతీయ చిరుదాన్యాలా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులు చిరు ధాన్యాలను సాగు చేసి, చిరుధన్యాల పంటలను ప్రోత్సాహించాలని కోరారు. అంతే కాకుండ తక్కువ నీటి ఖర్చుతో ఈ చిరుధాన్యాలను సులువుగా పండించే అవకాశం వుందని పేర్కొన్నారు. సబ్సిడి వేరుశనగ విత్తణాన్ని ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని కోరారు.అడ్వాయిజరీ బోర్డు చైర్మన్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతు విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరు విత్తనాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, సెరికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంపీఈఓ లు పాల్గొన్నారు.
-----------------------
Admin