Monday, 27 July 2026 04:22:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు...

Date : 25 March 2023 08:13 AM Views : 511

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామనవమి,పట్టాభిషేకం తిలకించడానికి భద్రాచలానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ఈ నెల 30వ తారీఖున జరగబోయే శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుండి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తులు భద్రాచలం చేరుకోవడానికి ఉపయోగించే రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.బందోబస్తు ప్రకారం కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది రోల్ క్లారిటీతో బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.స్థానికంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని,ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు.ఫిబ్రవరి నెలలో వర్టికల్స్ వారీగా విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రసంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్, డిఎస్పీలు రమణ మూర్తి,వెంకటేష్,రాఘవేంద్రరావు,రెహమాన్,నందీరామ్ మరియు జిల్లాలోని సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గోన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: