సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : హనుమాన్ జయంతి సందర్భంగా సుజాతనగర్ మండలంలోని వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని బాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పంచామృతాభిషేకం ఆకు పూజ తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు నాయకులగూడెం లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో హనుమాన్ భజన పాటలతో భక్తులు పరవశించారు జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ నామస్మరణలతో ఆలయ ప్రగనమంతా మారు మోగింది గ్రామస్తులు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వేపల గడ్డ పాతాంజనపురం నరసింహసాగర్ తదితర గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు
-----------------------
Admin