సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో మదీనా మసీద్ వీధి లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం పంచాయితీ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ఓబులదేవర చెరువు లోని మదీనా వీధిలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, ఒడిసి పట్టణ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, సర్పంచ్ గోవిందు, ఓడిసి గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజి ఆరిఫ్ ఖాన్, వారి ఆధ్వర్యంలో గృహసారుదులతో కలసి ఇంటింటికి వెళ్లి వారికి జగనన్న. పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, గత చంద్రబాబు పాలనకు జగనన్న పాలనకు తేడాను వివరించి, జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి తెలిపి, వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఇంటి దగ్గర పది నిమిషాలు గడిపి వారి దగ్గర నుంచి 8296082960 మిస్సేడ్ కాల్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు జానీ భాష, గృహ సారధి తుమ్మల హితైతుల్లా, ఆలం సబ్, తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు...
-----------------------
Admin