సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో కృషిచేసి ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ఎంతోమంది వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులు ఇప్పటికీ సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో నివసిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారని ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వ సేవ ప్రజాసేవ ఉచితంగా చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఇంతే కాకుండా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకొని ఉన్న జర్నలిస్టులకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారంగా ఆయా జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఆయా స్థలాల లో ఇండ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని దీంతోపాటు అన్ని ప్రాంతాలలో జర్నలిస్టు భవనాలు ప్రెస్ క్లబ్లు నిర్మించాలని కోరారు.ఇంకా ప్రతి జర్నలిస్టు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా ఉండేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు పడిసిరి వెంకట్ సూర్యాపేట పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin