సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న అక్సైడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కేవలం 396 లకు ఒక సంవత్సరంనకు 10 లక్షల రూపాయల పాలసీ ని అందిస్తుంది.. ఈ పాలసీని ప్రజల వద్దకు తీసుకు పోవటానికి షాద్ నగర్ మున్సిపల్ 25 వ వార్డు కుంట బడిలో కౌన్సిలర్ మాదురి నంద కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కార్మిక నేత పినపాక, యువ నేత నంద కిషోర్, ప్రభాకర్ ప్రారంభించారు. శుక్రవారం తేదీ 28 జూలై రోజున ఉదయము 9-00 గంటల కు కార్యక్రమం ప్రారంభించినారు కాలనీ వాసులు నందకిశోర్, జగన్, నక్కల శ్రీనివాస్, ప్రసాద్ పోస్ట్ ఆఫీస్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జుబేర్, ప్రభు శివాజీ నాయక్, ఆంజనేయులు నాగరాజు రాజు సుషీల్ పాల్గొన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని కాలనీవాసులు, షాద్ నగర్ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. ఈ రోజు మధ్యాహ్నము 3.00 గంటల వరకు నిర్వహిస్తున్నారు. కావలసిన వారు ఆధార్ కార్డు తో రావాలి.
-----------------------
Admin