Monday, 27 July 2026 08:47:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పదవికి విరమణ మాత్రమే... ప్రజాసేవకు దూరం కాదు...

Date : 04 July 2024 01:11 PM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశం అనంతరం రేపటితో పదవీకాలం ముగుస్తున్నందున జడ్పీ చైర్మన్ సభ్యులకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గుజ్జా దీపికా యుగంధర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటామని, సేవకు విరామము ఉండదని, విరమణ పదవికి మాత్రమే చేస్తున్నానని, ప్రజలకు సేవ చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఆమె తెలిపారు. రాజకీయ ఓనమాలు జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత చైర్మన్ కుర్చీలో కూర్చొని అన్ని నేర్చుకున్నాను అని దీనికి ప్రజా ప్రతినిధుల సహకారం, జిల్లా అధికారుల సహకారం ఎంతో తోడ్పడిందని ఆమె అన్నారు. తుంగతుర్తి ప్రజలు నన్ను జడ్పిటిసి గా గెలిపించి ఇంత ఉన్నత స్థానాన్ని ఇంత గౌరవాన్ని వారే కల్పించారని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా జడ్పీ సభ్యులందరం కలిసిమెలిసి ఉన్నామని ఆమె తెలిపారు. నన్ను ప్రోత్సహించి రాజకీయంగా ఎదగడానికి తన భర్త యుగంధర్ ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు. జడ్పీ చైర్మన్ స్థానంలో కూర్చుని ఎవరిని నొప్పియ్యకుండా పనిచేశానని, సొంత అన్న కంటే ఎక్కువగా వైస్ చైర్మన్ గొపగాని వెంకటనారాయణ తన పూర్తి సహకారం అందించారని ఆమె తెలిపారు. అధికారులు బాగా పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి జరుగుతుందని, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఎంతో తోడ్పడునందించారని, జడ్పీ చైర్మన్గా చెప్పిన పనులన్నీ అధికారులు పూర్తి చేశారని, వారికి నా యొక్క అభినందనలు తెలిపారు. నాతోటి సభ్యులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా సహకరించిందని పేరుపేరునా అందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలు తనతో పాటుగా ఉన్న జిల్లా పరిషత్ ఉద్యోగులకు, ఆఫీస్ సబార్డినెట్లకు, డ్రైవర్లకు, గన్ మాన్ లకు అందరికీ జడ్పీ చైర్మన్ అభినందనలు తెలిపారు. జెడ్పి సీఈవో వివి అప్పారావు మాట్లాడుతూ ఏ ప్రజా ప్రతినిధికైనా రాజకీయ ప్రస్థానం జడ్పీ నుంచి మొదలవుతుందని జెడ్పి సీఈవో తెలిపారు. అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించాల్సిందిగా సీఈఓ కోరారు. జిల్లా పరిషత్ కు ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా రావచ్చు అని వారికి తమ పూర్తి సహకారం అందిస్తామని జెడ్పి సిఇఒ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసియంఎస్ చైర్మన్ వేంకట్రెడ్డి,వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జడ్పిటిసిలు జీడి బిక్షం, పెన్పహాడ్ మామిడి అనిత అంజయ్య, నూతనకల్ జడ్పిటిసి దామోదర్ రెడ్డి, ఆరోపల్లి జెడ్పిటిసి దావుల వీర ప్రసాద్ యాదవ్, పాలకీడు ఎంపీపీ గోపాల్ నాయక్, హుజూర్నగర్ ఎంపీపీ శ్రీనివాస్ యుగేందర్,ఎంపీపీలు జాజిరెడ్డిగూడెం ఎం రేణుక ,సిహెచ్ వెంకటేశ్వర్లు, బండ్ల ప్రశాంత్ కుమారి, కొత్తమడి వెంకట్ రెడ్డి, పెండెం సుజాత,మఠంపల్లి ఎంపీపీ ముడావత్ పార్వతి కొండా నాయక్ ,కోటి పద్మావతి, యాతాకుఠల జ్యోతి, హుజూర్నగర్ జెడ్పిటిసి కే సైదిరెడ్డి, నడిగూడెం బాణాల కవిత ,కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :