సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్ ఫ్యాక్టరీ ఆడిటోరియం లో జరిగిన " తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం " కార్యక్రమానికి హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జాతీయ,అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టి ఎస్ ఐ పాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు.పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారిందని తెలిపారు.24 గంటల విద్యుత్, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన, సమర్ధవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని వెల్లడించారు. ఐటి రంగంలో దేశంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంది.2013-14 లో హైదరాబాద్ ఐటి ఉత్పత్తిలు 56వేల కోట్లు మాత్రమే కానీ నేటికీ వార్షిక వృద్ధితో 2,41,275 కోట్ల రూపాయల ఎగుమతులకు తీసుకొచ్చామని తెలిపారు.ప్రస్తుతం మన రాష్ట్రంలో 9,05,715 లక్షల ఐటి ఉద్యోగులు ఉపాధిని పొందారని అన్నారు.జిల్లాలో టి ఎస్ ఐపాస్ ద్వారా 720 యూనిట్లు అనుమతులు పొంది ఉన్నాయని,వీటిలో 55 పరిశ్రమలు ఇప్పటికే ప్రోడక్ట్స్ ప్రారంభించాయని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థిని , విద్యార్థులకు ఉపాధి కల్పించాలి ఐటి ని జిల్లాల్లో విస్తరించాలని సంకల్పంతో 74 కోట్ల రూపాయల ఎస్ ఐ ఎఫ్ తో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటి టవర్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దుటకు రూపొందించిన పథకం టి -ఐడియా" పథకమని, ఈ పథకం ద్వారా జిల్లాలో మెగా ప్రాజెక్టులకు,వాటి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు .మహిళ పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు అందించడం జరిగిందన్నారు.నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 984 అప్లికేషన్లకు గాను 205.15 కోట్లా రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 23777 అప్లికేషన్లకు గాను 3391.84 కోట్లా రాయితీలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల మరియు దివ్యంగుల సమగ్రా అభివృద్ధి కోసం రూపొందిన పథకం టి- ప్రైడ్ పథకమని,తెలంగాణ రాష్ట్రంలో టి ప్రైడ్ పథకం ద్వారా ఇప్పటివరకు 61120 అప్లికేషన్ లకు గాను 2781.26 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇండస్ట్రియల్ ,ఐటి శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి కృషితో తెలంగాణ రాష్ట్రం ఐటి హబ్ గా ,ఇండస్ట్రీయల్ హబ్ గా మారిందని ఆయన చెప్పారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ కి సహకరించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన తెలిపారు. అనంతరం మేళ్లచేరువు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొంకపాక రాధ కృష్ణ శర్మ అనారోగ్యంతో చికిత్స చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయగా, మంజూరైన రెండు లక్షల రూపాయలలో గల విలువ గల చెక్కును అందజేశారు.
-----------------------
Admin