సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు క్రియేటివ్ కరాటే డో ఆధ్వర్యంలో జనవరి 4న నిర్వహిస్తున్న జాతీయస్థాయి కరాటే పోటీల పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఆవిష్కరించారు.జాతీయ నాయకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జ్ఞాపకార్థం జనవరి 4న జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.క్రీడాకారులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు
-----------------------
Reporter