సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : జిల్లా పాలనాధికారి వెంకట్ రావు పాలకవీడు మండలంలో పలు కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రము లోని అంగన్వాడి స్కూల్,గ్రామపంచాయతీ, శానీటేషన్, మీసేవ కేంద్రాలను తనిఖీ చేశారు, ప్రభుత్వ యంత్రాంగం సేవా పని విధానం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.అన్ని కార్యాలయంలల్లో సిబ్బంది హాజరును తనిఖీ చేశారు, గైర్హాజరుకు చెప్పిన కారణాలను పరిశీలించి, సరైనదా కాదా అని ఆరా తీశారు, గ్రామస్థాయిలో సర్వీస్ గురించి ఆరా తీశారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,పల్లె దవఖాన ను పరిశీలించారు.అనంతరం జాన్ పహాడ్ దర్గాలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాలకవీడు ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్,తహశీల్దార్ శ్రీదేవి,ఎంపిడిఓ వెంకటచారి, రాజు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin