సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం ఆర్ సి నవంబర్ 25వ తేదీ. ప్రకాశం జిల్లా. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో నీ జాతీయ రహదారి పక్కన ఆంజనేయస్వామి గుడి వద్ద దిక్కుతోచని స్థితిలో అనాధగా ఓ అవ్వ పరిస్థితిపై స్పందించిన అధికారులు చలిలో వణుకుతూ వికట జీవిగా పడి ఉన్న ఆ అవ్వను చూచిన ప్రతి ఒక్కరూ స్పందించి స్థానిక ఎర్రగొండపాలెం తాసిల్దార్ బాలకిషోర్ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ముసలి అవ్వ దగ్గరికి వచ్చి ఆమెను వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సహాయం అందించడం జరిగింది. స్థానిక ఎమ్మార్వో మనం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎస్ ఎస్ ఆర్ ట్రస్ట్ సహకారంతో కురిచేడు లోని వెస్ట్ వీరయ్యపాలెం వృద్ధాశ్రమంలో చేర్చేందుకు స్థానిక ఎమ్మార్వో చర్యలు తీసుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమంలోని నిర్వాహకులకు అవ్వను అప్పగించడం జరిగింది. కడుపున పుట్టిన కన్న బిడ్డలే ఇలా అనాధగా రోడ్డుపై వదిలేయటం ఇది మంచిది కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించండి....
-----------------------
Admin