సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని పాత బస్ డిపో నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి,ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. యు ఎస్ పి సి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొత్తగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్య ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఈ పి 20 20 ని రద్దు చేయాలని, ఇన్కమ్ టాక్స్ పరిమితిని పెంచాలని, పే రివిజన్ కమిటీని నియామకం చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-----------------------
Admin