సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఓబులదేవర చెరువు మండలంలో ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఓబుల దేవర చెరువు పోలింగ్ సరళిని ఆర్డీవో భాగ్యరేఖ పరిశీలించి ఎన్నికల అధికారి అనిల్ కుమార్ తో మాట్లాడుతూ ఓటింగ్ శాతంపై ఆరా తీశారు. మండలంలో పట్టభద్రులు మొత్తం 1028 మంది ఓటర్లు ఉండగా 761 మంది పోలింగ్ జరిగింది. పట్టభద్రుల ఓటింగ్ శాతం 74 % శాతం పోలింగ్ జరిగింది. మండలంలోఉపాధ్యాయులకు సంబంధించ 53 ఓట్లు ఉండగా మొత్తం 50 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయల ఓటింగ్ శాతం 94 %శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రక్రియను ఎంపీడీవో పోలప్ప ,తాసిల్దార్ శ్రీధర్ , నల్లమడ ఎస్సై వలి భాష, ఓ డి సి ఎస్ ఐ గోపి తదితరులు పర్యవేక్షించారు....
-----------------------
Admin