సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడేది ఒక్క బీఎస్పీ పార్టీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో పాదయాత్ర నిర్వహించి,ప్రతిరోజు వెయ్యి మందిని కలిసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఏ ఒక్క పార్టీ పోరాటం చేయడం లేదని,ప్రతీ సమస్యను భుజాన వేసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు.పార్టీలను చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని,అది మంచి సాంప్రదాయం కాదని అన్నారు.నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని అధికారుల దృష్టి కి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేసే వారికి ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి డబ్బు మద్యం పంచి గెలవాలనుకునే వారికి ఈసారి గుణపాఠం చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో మాలోత్ వీరు నాయక్,భూక్యా శంకర్,రవికుమార్,రూప్ సింగ్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin