సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి వికేంద్రీకరణకే మా మద్దతు *శ్రీ భాగ్ ఒడంబడికకి 85 సం. పూర్తి అయిన సందర్భముగా అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులతో లో కలిసి పాల్గొన్న సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ నేడు బుధవారం 3 గం. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శ్రీ భాగ్ ఒడంబడికకి 85 సం. పూర్తి అయిన సందర్భముగా అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులతో లో కలిసి పాల్గొన్న సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ, మాట్లాడుతూ ఆంధ్ర రాష్ర్టంలో అన్ని ప్రాంతాల సమాన అభివృధ్దికి, సాధికారితకు ఊతమిచ్చేవిధంగా 1937 నవంబర్ 16 న కోస్తా-రాయలసీమ ప్రాంతాల మధ్య ఒక పెద్దమనుషుల ఒప్పందం జరిగిందిని, శ్రీ భాగ్ ఒడంబడికగా పేరుబడిన ఈ ఒప్పందానికి ఈ ఏడాది నవంబర్ 16 వతేదీకి 85 ఏళ్ళు. ప్రస్తుతం రాష్ర్టంలో మన పార్టీ, మన నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ గారు గొప్ప లక్ష్యంగా పెట్టుకుని నిజమైన వికేంద్రీకరణకు బాటలు వేస్తున్న నేపధ్యంలో మన లక్ష్యాన్ని అలాగే అన్ని ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలాంటి వెనకబడిన ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే శ్రీ భాగ్ ఒడంబడికను గుర్తు చేసుకోవడం అవసరం అని పేర్కొన్నారు. ఈరోజు అమరావతి ఒకటే రాజధానిగా రుద్దడం ద్వారా అధికారం-అభివృధ్ది కేంద్రీకృతం చేస్తూ తమ స్వార్ద ప్రయోజనాల కోసం అది కూడా రాష్ర్ట ప్రజలందరి కోర్కెలాగా చూపే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ లాంటి శక్తుల కుయుక్తులను తిప్పికొట్టాల్సిందే అని అన్నారు. వికేంద్రీకరణను ప్రతిబింబించేవిధంగా ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు మరోచోట విశ్వవిద్యాలయం అంటూ మూడు ప్రాంతాల ఆకాంక్షలను తీర్చాలనే బలమైన రాజకీయ కృతనిశ్చయం దాదాపు 100 ఏళ్ళనుంచి ఉందనే విషయం స్పష్టమవుతుంది అని పేర్కొన్నారు.. అన్ని ప్రాంతాల వారు, అన్ని అన్ని వర్గాల ప్రజలు వికేంద్రీకరణకే మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు పి వి సిద్ధారెడ్డి , మడకశిర శాసనసభ్యులు తిప్పేస్వామి , ఇతర ముఖ్య నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin