సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆలూరు మండల కేంద్రంలోని వివిధ గణేష్ మండపాల్లో అన్నదానల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా 32 క్వింటల్లా 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని భావించి ఈ సారి నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు, యువకులు మంచి మార్గంలో పయనించి భక్తి శ్రద్ధతో గణపతిని పూజించి ఆయన ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.నియోజకవర్గం లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవిధంగా ఆశీర్వదించాలని గణపతిదేవుని ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలూరు మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్, వైస్ ఎంపీపీ భోజళ చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మజి శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మీ మల్లేష్, సొసైటీ చైర్మన్ ఇస్సాపల్లి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు రేగుల రజనీకాంత్, మోతే శ్రీనివాస్, జై భీమ్ యూత్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin