సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండల పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాలలో భాగంగా కొబ్బరికాయలు కొట్టి, త్రివర్ణ పతకాన్ని ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు చుట్టు పక్కన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ గీతం పాడారు.ఈ సందర్భంలో SI తిరుపతి మాట్లాడుతూ మనకు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయింది ఇప్పుడు 10 వ సంవత్సరంలో అడుగు పెడుతూ బంగారు తెలంగాణ లో ప్రజలు, రైతులు సంతోష పడుతున్నారు అని చెప్పారు.జాతీయ గీతం అయిపోయాక అందరికి స్వీట్ లు, బిస్కెట్ లు, చాకోలెట్ లు పంచి పెట్టి ఆనంద్దాన్నీ పంచుకొన్నారు.
-----------------------
Admin