సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట క్యాంపు కార్యాలయములో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు గాను గౌరవ శాసనసభ్యులు శ్రీ. యస్. రాజేందర్ రెడ్డి కి అభినందనలు ధన్యవాదాలు తెలిపిన జిల్లా వాల్మీకి బోయ నాయకులు..... గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ....... ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేస్తూ కేంద్రానికి మరోసారి పంపనట్లు కేసిఆర్ గారు వెల్లడించారు. అయితే గతంలో కూడా అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వానికి పంపితే పట్టించుకోలేదని అయినా మరోసారి వాల్మీకి బోయలను మరియు మరికొన్నికులాలను ఎస్టీ జాబితాలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దశాబ్దాల కాలంగా వాల్మీకి బోయలు చేస్తున్న పోరాటకల నెరవేరింది. అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అన్ని రంగాలు వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేస్తున్న కృషి ఫలించిందని అయన అన్నారు..
-----------------------
Admin