సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అనపరెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో వేకువ ఫౌండేషన్ వారు అనుపరెడ్డిపల్లి మండల ఎర్రగుంట గ్రామ వాసి అయిన పూర్ణ చంద్రశేఖర్ రావు చొరవ తో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనెల 20వ తారీకు నుండి 25వ తారీకు వరకు నియోజకవర్గ కొన్ని మండలాలలో వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయని అన్నారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమంలోనీ అంశాలు, పూర్ణ చంద్రశేఖర రావు విద్యార్థులకు ఉపదేశించి అంశాలు, సమన్వయ నిర్వాహన, లక్ష్యసాధన, మానవతా విలువలు, ఏకాగ్రతతో కూడిన జ్ఞాపకశక్తి మెలుకువలు, నాయకత్వ లక్షణాలు, సానుకూలత లక్షణాలు, ఆత్మవిశ్వాసం అలాంటి అంశాలతో భవిష్యత్తు కోసం బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో నియోజకవర్గంలోని కొన్ని మండలాలలోని ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin