సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు హుజుర్ నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారతదేశానికి ఆగస్టు 15 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణలోని పది జిల్లాలకు సెప్టెంబర్ 17 1948లో స్వాతంత్రం రావడం జరిగింది... అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం నవాబు అయిన కాశీం రిజ్వి లొంగిపోయి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రాన్ని అందించడం జరిగింది... భారతీయ జనతా పార్టీ గత 25 సంవత్సరాల నుండి సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని పోరాటం చేస్తూనే ఉంది... సెప్టెంబర్ 17 నాడు ఎన్ని ఆంక్షలు విధించిన భారతీయ జనతా పార్టీ జాతీయ జెండాను ఎగురవేస్తూనే వస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పత్తిపాటి విజయ్, అంబళ్ల నరేష్ గౌడ్, గుండెబోయిన వీరబాబు, ఇంటి రవి, కొంకాయల మస్తాన్ రెడ్డి, పొల్లా వెంకటేశ్వర్ రావు, గుండా గోపి, సాధనాల నాగరాజు,గంగినేని రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin