Sunday, 26 July 2026 04:54:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.... -రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్

Date : 25 June 2023 12:06 AM Views : 452

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వేల మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పది సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఎక్కడా సంపూర్ణ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అక్కడక్కడ ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ,అవి అక్కడక్కడ సమస్యలుగా తయారవుతున్నాయని వాటి పరిష్కారం చూపుతూ ఇంతవరకు ఇంటి స్థలాలు తీసుకొనని జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా రూపాయి ఖర్చు లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.ప్రతి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవనాలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ లు నిర్మించి జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పక్కా జర్నలిస్టు భవనాలు లేని ప్రాంతంలో జర్నలిస్టులు చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద హోటల్లో గడపాల్సిన దిక్కుతోచని స్థితిలో జర్నలిస్టులు ఉన్నారని గుర్తు చేశారు.అదేవిధంగా పోలీసుల నుండి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ భరోసా కార్డులు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.చిన్న మీడియా పెద్ద మీడియా అని తేడా లేకుండా వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.అనంతరం అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతి పత్రం అందించారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్పీ నాగబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర కోశాధికారి వంగాల వెంకటాచారి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రఘువరన్ ఆచార్యులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గట్టిగుండ్ల రాము,ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి, ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొరివి సతీష్ యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి సైదులు, సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు బరిగల విజయకుమార్, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్ర రాజు, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిలక సైదయ్య హుజూర్ నగర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పిడమర్తి రాజు, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు పడిసిరి వెంకట్,సూర్యాపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ధరావతు సూర్యాపేట నియోజకవర్గ కార్యదర్శి మర్యాద సోమ సోమయ్య పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :