సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట సెప్టెంబర్ 21 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) పై కుట్ర పన్ని విచ్చినం చేసేందుకు వరంగల్ జిల్లాలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల సంఘ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బి. మల్లేష్ అన్నారు. నర్సంపేటలోని ఎస్ ఆర్ ఓకేషనల్ కళాశాల అవరణలో సురేష్ అధ్యక్షతన అదివారం టీడబ్ల్యూజేఎఫ్ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ రెండు నెలల క్రితమే టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా తృతీయ మహాసభ జరిగిందని, పూర్తిస్థాయి జిల్లా కార్యవర్గం కమిటీ ఎన్నికున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. గతంలో యూనియన్ జిల్లా బాధ్యతలు గా ఉన్నవారు మూడేళ్లుగా జర్నలిస్టుల సమస్యలను, సంఘం అభివృద్దిని పట్టించుకోకుండా సంఘాన్ని బలహీన పర్చిన వ్యక్తులు మళ్ళీ తమకే నాయకత్వం కావాలంటూ కుట్రలు చేస్తున్నారన్నారు. ఒకే పత్రికకు చెందిన ఆ నలుగురైదుగు యూనియన్ ను శాసిస్తున్నారన్నారు. చర్యలను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడైన మామిడి సోమయ్య నేతృత్వంలో పలువురు వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు అడ్డుకుని ప్రజాస్వామ్య బద్దంగా యూనియన్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే రెండు నెలల క్రితం వరంగల్ జిల్లాలో సభ్యత్వ నమోదు చేపట్టి జిల్లా మహాసభ, కమిటీ ఎన్నిక జరిపించడం జరిగింది. రెండు నెలలుగా జిల్లాలో సంఘం బలపడి, జర్నలిస్టుల సమస్యలపై కార్యాచరణకు పోతున్న తరుణంలో కొందరు వ్యక్తులు తమ ఉనికి పోతుందనే దురాలోచనతో సంఘం నాయకత్వం తమకే ఉండాలన్న స్వార్థ బుద్దితో సంఘాన్ని చీల్చేందుకు ఈనెల 22 న మళ్ళీ మహాసభ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. విచ్చిన్నకర వ్యక్తుల చేస్తున్న చర్యలకు జిల్లాలోని జర్నలిస్టుల మద్దతు గానీ, ప్రజాప్రతినిధుల, అధికారుల మద్దతు గానీ లేదన్నారు. కేవలం రాష్ట్ర, జిల్లా సంఘంలోని ఒక పత్రికకు చెందిన కొద్ది మంది నాయకుల, జర్నలిస్టుల మద్దతుతో ఫెడరేషన్ విచ్చిన్నకర చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలు అనేకం ఉన్నాయి. సమస్యలపై దృష్టి పెట్టకుండా, ఉద్యమ కార్యాచరణకు పోకుండా కొందరు సంఘంలో చిచ్చుపెట్టి సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇతర సంఘాలు పాలకుల పక్షాన చేరాయి. జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న ఏకైక టీడబ్ల్యూజేఎఫ్ ను చీల్చే కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలో భయటపడుతుంది. ఐక్యంగా,బలంగా ఉన్న ఫెడరేషన్ విచ్చిన్నం కానివ్వబోమన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులు ఐక్యతతో విచ్చిన్నకర వ్యక్తుల శక్తులను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈసమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు టీ. స్వామినాథ్ ,జిల్లా కోశాధికారి భానోత్ సురేష్ , సహయ కార్యదర్శి గాదం సురేష్ , కార్యవర్గ సభ్యులు కందలోజు శ్రీనివాస్ , శేట్టిపెల్లి విజెందర్ , తౌటు శ్రీకాంత్ , వల్లభనేని కిరణ్ , మామిండ్ల వీరారెడ్డి ,మాధరపు శ్రీనివాస్ ,వీరభధ్రయ్య ,కె.భరత్ ,వెంకన్న ,నరేష్ ,వెంకన్న ,శ్యామ్ తదితర పాత్రికేయ మిత్రులు పాల్గోన్నారు.
-----------------------
Reporter