సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో (నవంబర్ 16 నుండి జనవరి 17 వతేది వరకు)63 రోజులు అయ్యప్ప భక్తులకు అన్నదానం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఓడిసి యువసైన్యం సేవకులు అన్నదానం ఏర్పాటు చేయగా,తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్,ఎస్ఐ కే.గోపీ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి,భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.... శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో ప్రతి యేటా నవంబర్ 30 వతేదిన వందలాది మంది మాలధారణ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదానం, పేదలకు చేయూత, కరోనా సమయంలో నిత్యావసర సామాగ్రి, భోజనాలు తదితర సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా ఓడిచెరువు యువసైన్యం నిర్వహించడం అభిననీయమని తహసీల్దార్ కునుకంట్ల శ్రీధర్, ఎస్ఐ కే. గోపీ కొనియాడారు. ఈసందర్బంగా యువసైన్యం సేవకులు బాబ్జాన్(లడ్డు)సోమల మోహనరెడ్డి,శ్రీనువాసులు, జహీర్, రవి, వీర, రమేష్ తదితరులు మాట్లాడుతూ.... శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయానికి మాట్లాడుతూ.... అయ్యప్పస్వామి ఆలయంలో సేవా కార్యక్రమాలకు అవకాశం కల్పించినందుకు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడుకు ధన్యవాదములు తెలిపారు.దాదాపుగా 260 మంది అయ్యప్ప భక్తులకు యువసైన్యం సేవకులు అన్నదానం ఏర్పాటు చేసారని తెలిపారు....
-----------------------
Admin