సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం త్వరలోనే అసెంబ్లీలో సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం తీసుకురానున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్ తరాలు బాగుపడాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని స్పష్టం చేవారు. గురువారం నగరంలోని 8వ డివిజన్‌లో కార్పొరేటర్ సుమతితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశం ఉండడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగదని చెప్పారు. అందుకోసమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం స్వార్థ రాజకీయాలతో అడ్డుకుంటున్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాల కోసమేనని అన్నారు. వికేంద్రీకరణకు సంబంధించి సమగ్ర బిల్లును త్వరలోనే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడుతూ మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5వ తేదీన కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని..మేధావులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి మన ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ మహహ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్‌బేగ్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin