Sunday, 26 July 2026 10:40:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చాకలి ఐలమ్మ జోలికొస్తే సహించేది లేదు...

Date : 19 September 2022 12:52 AM Views : 902

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి పట్టణంలో రజక సంఘం సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు బెల్లంకొండ రాము, ఉద్యోగ సంఘాల నాయకులు యోగానంద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమూహం తో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా సత్తుపల్లి లో గల తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి రింగ్ రోడ్ సెంటర్ కి పాదయాత్రగా వెళ్ళారు, రింగ్ సెంటర్ లో బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి దిష్టి బొమ్మని దహనం చేశారు. ఈ కార్యక్రమానికి *జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గిస్తూ మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడతాయ నిఅటువంటి గొప్ప మహనీయులను కించపరిచే హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికి, ఏ రాజకీయ పార్టీకి లేద ని అని ఆయన చేశారు. ఒక మహిళగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసినటువంటి వీరోచిత పోరాటం ,పోరాటపటస్ఫూర్తిగా తీసుకొని నాటి నుంచి ఎన్నో ఉద్యమాలు ఈ రాష్ట్రo లో నడిచాయ ని అంతే కాకుండా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి తోనే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాo అని చెప్పినటువంటి విషయాలను ఈ దద్దమ్మలు తెలుసుకోవాలని ఆయ న విమర్శించారు. ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో రజక కులస్తుల ఆత్మ గౌరవ ప్రతీకలు అయినటువంటి చాకలి ఐలమ్మ ను కించపరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజం చూస్తూ ఊరుకోద ని, చాకలి ఐలమ్మ పోరాటాన్ని చిట్టెలుక తో పోల్చిన బిజెపి నాయకుకు ప్రకాష్ రెడ్డి మాట్లాడిన నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీ లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈటల రాజేందర్ , బండి సంజయ్ లు ఎంపీ అరవింద్ స్పందించక పోవటం బాధాకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అమ్మగా భావించే చాకలి ఐలమ్మ ను కించపర్చిన ప్రకాష్ రెడ్డిని వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చాకలి ఐలమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్రకాష్ రెడ్డి ముక్కు నేలకు రాసి రజక సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. రజక సంఘాలు చేసిన ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు పలికిన టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, సత్తుపల్లి పట్టణ కేంద్రంగా రజక సంఘలా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుకు.బండి ప్రకాష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకుపెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈకార్యక్రమాల్లో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, రజక సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలి పారు. మట్టా దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మత్యాగం చాలా గొప్పదని మహనీయుల త్యాగాలను మనం స్మరించుకోవాలే తప్ప అటువంటి మహనీయుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి బేషరతుగా రజక సమాజానికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే అంతవరకూ రజక సంఘాలు చేసే ఉద్యమానికి తనసంపూర్ణ మద్దతు ఉంటుందనీ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో. సిపిఐ నాయకులు రామకృష్ణ, రజక సంఘం నాయకులు తెలగారపు అప్పారావు, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు మరికంటి శీను, విరివాడ నాగభూషణం, రాము, చింతల సత్యనారాయణ, టోపీ శ్రీనివాస్, రాయల కోటి, కోట, రామ్మూర్తి ,సాంబ ,తో పాటుగా పెద్ద ఎత్తున రజక కులస్తులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: