సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు సైది రెడ్డి ఇంటిని ముట్టడి చేయుట జరిగినది .ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన కాడి నుండి ప్రతిరోజు గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న తమను పట్టించుకోవట్లేదు తమకు గవర్నమెంట్ పే స్కేల్ 19,500 ఇవ్వాలని అలాగే గత 30 40 సంవత్సరాలు చేస్తున్న కార్మికులను కూడా రెగ్యులరైజర్ చేసి ఆదుకోవాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి వినతి పత్రం అందజేశారు.
-----------------------
Admin