సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో ఈనెల 11, 12 తేదీలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు... కొత్తగూడెంలో రెండు రోజులపాటు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు అందరూ ఆహ్వానితులేనని కొత్తగూడెంలో జరిగిన విలేకరు సమావేశంలో వెల్లడించారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. సింగరేణి ఉమెన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరూ రావాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin