సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఎం ఎల్ ఏ వనమా వెంకటేశ్వరరావు అభివృద్ధి పనుల పై నియోజకవర్గ అధికారుల తో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం లో ఎం ఎల్ ఏ వనమా ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి. కొత్తగూడెం లో వందల కోట్ల నిధుల మంజూరు తో నిర్దేశించిన పనులు వేగంగా ప్రారంభించాలని సూచించారు. 25 రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులకు తెలపటం తో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ తానే పోటీ చేస్తానని, సిఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తో ఇటీవల రెండు సార్లు సమావేశం అయ్యానని, నిధుల విషయం లో కొత్తగూడెం కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నోటిఫికేషన్ లోగా పనులన్నీ వేగం పుంజకోవాలని సూచనలు చేశారు . కొత్తగూడెం మున్సిపాలిటీ లో 115 కోట్లు, పాల్వంచ మున్సిపాలిటీ కి 100 కోట్లు, మూరెడు రిటైనింగ్ వాల్ కు 33 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, పంచాయతీ రాజ్ నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. ప్రణాళిక ఆధారంగా అధికారులు సమన్వయం తో పనులు చేపట్టాలన్నారు. సమావేశం లో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin