Sunday, 26 July 2026 07:13:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సింహభేరి సభలో అదరగొట్టిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి...

Date : 11 November 2023 10:56 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నేడు సమాజంలో రాజకీయాలంటే దోచుకుని దాచుకోవడం, అమాయక ప్రజలపై అధికారం చలాయించడంగా మారిందని సేవ భావంతో ఇంతకాలం ప్రజల మధ్య ఉన్న తనను మీ బిడ్డగా ఆశీర్వదిస్తే ప్రజా నాయకుడిగా ఎల్లప్పుడూ మీ సేవలో తరిస్తానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సుమారు 40 వేల మందితో ఆయన సింహభేరి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ సింహబేరి సభకు తనపై ఉన్న నమ్మకంతో హాజరైన మహిళా మణులకు, యువకులకు ముందుగా ఆయన పాదాభివందనం తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నానని... భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో ఉండాలని భావించినప్పటికీ కొందరి కుట్రల కారణంగా తనకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం వారి కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పోటీలో నిలిచినట్లు ఆయన తెలిపారు. సేవే పరమావధిగా ప్రజల ముందుకు వస్తున్న తనను పెద్ద మనసుతో దీవించి సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీని అందించాలని కోరారు. రాజకీయాలు బ్రష్టు పట్టిపోయాయని ప్రజల ఆకాంక్ష ఒకలా ఉంటే రాజకీయ నాయకుల ఆలోచన మరోలా ఉండడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో పెను మార్పులు తేవడంతోపాటు నాయకుడంటే కేవలం సేవకుడిగా మాత్రమే ఉండాలనే భావనను అందరికీ తెలిసేలా పనిచేస్తానని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత షాద్ నగర్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ దక్కుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడే ప్రతి ఏడాది 5000 ఉద్యోగాల కల్పనగా, ఐదేళ్లలో 25వేల ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు అందిస్తానన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది నియోజకవర్గ మహిళా మణులకు రాఖీ కానుక అందుతుందన్నారు. అందర్నీ ఆకట్టుకున్న అంబలి కేంద్రాలు కూడా ప్రతి ఏడాది కొనసాగుతాయన్నారు. మొదటి సంవత్సరంలో రైతులకు ఫసల్ బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ ను తానే చెల్లిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. విస్తరణ కానుకగా ఒక నెల ఉచిత సిలిండర్ ఖర్చును అందిస్తానని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ, ఉన్నత విద్య కోసం ట్రస్టు ద్వారా నిరంతరం సేవ చేస్తానని మాట ఇచ్చారు. సభకు హాజరైన మహిళా మణులు యువకులంతా షాద్ నగర్ లో డిసెంబర్ 3న కొత్త చరిత్రను సృష్టించచబోతున్నారని.... న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించడం కోసం "సింహం గుర్తుకు ఓటు" వేయాలని కోరారు. జరగబోయే ఎన్నికల్లో ధర్మాన్ని గెలిపించాలంటే మంది మాటలు వినోద్దు అని మనసు మాట వినాలని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మహిళలకు ప్రధానంగా సూచించారు. రాజకీయాల్లో ఎవరైనా సంపాదన కోసం వస్తారని లేదా పేరు ప్రఖ్యాతుల కోసం వస్తారని సేవ కోసం వచ్చేవాళ్లు షాద్ నగర్ చరిత్రలో ఎవరూ లేరని సేవ చేసుకునే భాగ్యం తనకు ఉందని గుండెల నిండా సేవ నింపుకొని.. ప్రజలే శ్వాసగా బ్రతుకుతానని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నమ్ముకున్న వారే తనను అడుగడుగునా వంచించినా ఎక్కడ అదరలేదు బెదరలేదు అని తన వెంట నడిచే అక్కాచెల్లెళ్లు అన్న తమ్ముళ్లు అంతా ప్రజలేనని అన్నారు. మీ బిడ్డగా దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అందరికీ అండగా నిలబడతారని అన్నారు. చరిత్రలో ఎంతోమందిని ప్రజలు గెలిపించారని ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారని కానీ తనలాంటి సేవకుడిని గెలిపిస్తే ఎంతోమంది యువతను సేవకులుగా తయారు చేస్తానని భరోసా ఇచ్చారు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిలో సగం వాటా నియోజకవర్గ ప్రజలదేనని అందుకే నామినేషన్ అయ్యాక మీడియా ముందు తన ఆస్తి సగాన్ని పాలమూరు చారిటబుల్ ట్రస్టుకు శాశ్వతంగా రాశానని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు నా ఆస్తిపాస్తులు ప్రజలేనని వారికి చిన్న ఇబ్బంది కూడా రానివ్వనని అన్నారు సేవలు యధావిదంగా కొనసాగుతాయని అందుకే తన ఆస్తిలో సగం వాటాలు ప్రజల సేవ కొసం రాస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు సింహం గర్జించింది అంటూ విష్ణువర్ధన్ రెడ్డిని అభినందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: