Sunday, 26 July 2026 09:53:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదన్నందుకు "మర్డర్"

Date : 06 September 2025 10:21 AM Views : 310

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : బంజారాహిల్స్‌ : నా సెల్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. మీ సెల్‌ ఇస్తే కాల్‌ చేసుకొని ఇస్తానన్నాడు. ఎదుటి వ్యక్తి నుంచి బ్యాలెన్స్‌ లేదని సమాధానం రావడంతో చేయి చేసుకున్నాడు. తండ్రి, ఇద్దరు కలిసి యువకుడిపై ప్రతిదాడి చేయగా మృతిచెందాడు. రోడ్డు నంబరు 14కు చెందిన శ్రీధర్‌(30) ఈవెంట్స్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న తన వద్దకు స్నేహితుడు రావడంతో అతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని రోడ్డునంబరు 2లోని బస్టాపులో దించేశాడు.తిరుగు ప్రయాణంలో రోడ్డు నంబరు 14 ఆశా హాస్పిటల్‌ వద్దకు చేరుకున్నాడు. ఇంతలో తన సెల్‌ స్విచ్చాఫ్‌ కావడాన్ని గుర్తించి ఆసుపత్రి వాచ్‌మన్‌ వెంకటయ్యను ఫోన్‌ అడిగాడు. తన ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదని వెంకటయ్య చెప్పాడు. దీంతో శ్రీధర్‌ ఫోన్‌ ఇవ్వడం ఇష్టం లేక అబద్దం చెబుతావా అంటూ అడిగాడు. మాటమాటా పెరుగగా వెంకటయ్య పై శ్రీధర్‌ చేయిచేసుకున్నాడు. వెంటనే వాచ్‌మన్‌ తన కుమారులు హరికృష్ణ, తరుణ్‌లను పిలిచాడు.ముగ్గురు కలిసి శ్రీధర్‌ను సెల్లార్‌లోకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. దెబ్బలతో ఇంటికి వచ్చిన శ్రీధర్‌ స్పృహ కోల్పోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శ్రీధర్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :