సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆత్మకూర్ (యస్ ) మండల కేంద్రంలోని పాతర్ల పహాడ్ ఎక్స్ రోడ్డు నందు బేతెస్థ ప్రార్ధన మందిరం (డబ్ల్యూ. యం. ఈ) చర్చ్ పాస్టర్ మరియు ఆత్మకూర్ (యస్ ) మండల పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. గుంటూరు శాంతాయ్య ఆధ్వర్యంలో ఇటీవల కలకత్తా లో జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన మానభంగం హత్యపై తీవ్ర నిరసన సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ సంఘీభావం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య ప్రసంగికులుగా డబ్ల్యూ యం ఈ ఉమ్మడి రాష్టాల డైరెక్టర్, పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ సలహదారులు రెవ. డా. పి. జాన్ మార్క్, గౌరవ సలహాదారులు రెవ. మిట్టగడుపుల హాజర్య, రెవ. బొక్క ఏలీయా రాజు, రాజ బాబు లు పాల్గొని ప్రసంగించారు. సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ ఇరుగు సంసోను మాట్లాడుతూ కలకత్తా మహానగరం ఆర్.జి.కర్. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ అయిన జూనియర్ డాక్టర్ మౌమిత ను ఆగష్టు 9, 2024న దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయబడిందనీ. ఆమె నిర్జీవమైన శరీరం కళాశాల క్యాంపస్‌లో కనుగొనబడిందనీ, ఇది భారతదేశం అంతటా ఆగ్రహం మరియు దుఃఖాన్ని రేకెత్తించిందనీ.ఈ దారుణమైన నేరం మహిళలు మరియు వైద్య నిపుణుల భద్రత గురించి జాతీయ చర్చను తీవ్రతరం చేసింది, ఈ విషయంపై విస్తృతం గా ప్రజలు, స్వచ్చంద ప్రజా సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు మరియు న్యాయం కోసం డిమాండ్లు చేస్తునప్పటికి ఇప్పిటికి ఆమె కుటుంబానికి న్యాయం జరుగకపోవడం దారుణం అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు రెవ ఇంజమూరి గాబ్రియేల్,ప్రధాన కార్యదర్శి రెవ. డా ధరవత్ లాకు నాయక్, ట్రెజరర్ రొంపికుంట్ల స్పర్జన్ రాజు,నియోజకవర్గం అధ్యక్షులు రెవ డా జలగం జేమ్స్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బానోత్ శామ్యూల్,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు జాన్ పాల్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్,సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిష్టఫర్, రెవ. టి. కిరణ్ బాబు,రెవ. డా. పంది మార్క్,పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ నకిరేకంటి సైమన్, పాస్టర్ బానోత్ సుధాకర్, సైదా నాయక్,మామిడి క్రిష్టఫర్,పిట్టల సమూయేల్, పాస్టర్ పి. సంజీవ, పాస్టర్ బొల్లెద్దు మోసేతదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin