సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోతు పురుషోత్తం ఈనెల 19న గురువారం జరిగిన జిల్లా స్థాయి మేదర సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా పోతు పురుషోత్తం ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికవ్వడం ఈ సంఘం ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా పోతు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా పెద్ది నాగకృష్ణ, కోశాధికారిగా ముద్దమూరి సోమయ్య, ప్రచార కార్యదర్శిగా కొండ సంజీవరావు లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పోతు పురుషోత్తం మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ అవకాశం దుర్వినియోగం చేసుకోనని అందరికీ సేవ చేస్తానని తన సన్నిహితులకి కులానికి వారి మాటకి కట్టుబడి ఉంటానని అన్నారు. ఈయన గెలుపుపై తన స్నేహితులు బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈయనకి పట్నూరి సంజీవరావు, వినయ్, రేపాల రాజేశ్వరరావు, పోతు రమేష్, సుధాకర్, మల్లికార్జున్, శ్రీను, సిల్లీబేరి సత్యనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
-----------------------
Admin