సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నంలో జిల్లా స్థాయిలో జాతీయ సమగ్ర అవగాహన సదస్సు, శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం డైట్ కళాశాల నందు జిల్లా లీడ్ బ్యాంక్ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఆర్. బీ. ఐ అదేశాల మేరకు జిల్లా స్థాయి జాతీయ సమగ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు నివారణ గురించి జిల్లా సైబర్ క్రైమ్ సెల్ ముఖ్య అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతు ప్రతి ఒక్కరు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలని,ఒక వేళ సైబర్ నేరాలకు గురైన అయినచో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఆన్ లైన్ పోర్టల్ https/cyberpolice.nic.in లకు పిర్యాదు నమోదు చేసుకోవాలని తెలపడం జరిగింది. అలాగే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యమ్ సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు సేవల పైన మీకు ఏదైనా సమస్యలు ,ఇబ్బందులు ఉన్నచో ముందుగా బ్యాంకు మేనేజర్ కి తెలియజేయాలని,సమస్య పరిష్కారం కానిపక్షంలో బ్యాంక్ అంబుడ్స్ మన్ లేదా ఆర్.బీ.ఐ అంబుడ్స్ మన్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14448 లేదా ఆన్ లైన్ పోర్టల్ https.//cms.rbi.in లో నమోదు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డి.ఆర్.ఎం రాంప్రసాద్ రెడ్డి ,డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్, రూడ్ సెట్ డైరెక్టర్ లోక్ నాథ్ , ఇతర అన్ని బ్యాంకుల అధికారులు డ్వాక్రా సంఘ సభ్యులు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పుట్టపర్తి డైట్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin