Sunday, 26 July 2026 08:13:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పద్మశాలీల రాజ్యాంగం సాధనకై చలో కోరుట్ల...

Date : 09 August 2023 03:16 AM Views : 538

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్య పేట : పద్మశాలీలకు రాజ్యాధికార సాధన కోసం ఈ నెల 13న కోరుట్లలో రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీ ఆర్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించి మాట్లాడారు. పద్మశాలీలను ఓట్లవేసే యంత్రాలుగా ఉపయోగించుకుని, అధికారంలోకి రాగానే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమకు 10 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపి స్వీట్లు, 2 ఎంఎల్సి, 1రాజ్యసభ సీట్లను కేటాయించాలని, పద్మశాలీలకు డిక్లరేషన్ ప్రకటించాలని, డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీ తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వని రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.తమకు కూడా పద్మశాలీ బంద్ ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇచ్చి బీద చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత వృత్తి చేసే వారికి రైతుబంధు లాగా నెలకు 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆకలి చావు ఆపాలని, క్రిమిలేయర్ నుండి పద్మశాలి కులాన్ని తొలగించాలని, రంగులను నులును 100% సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తాము ముందుండి పోరాడామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు 1969 లోనే క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా మలిదశ ఉద్యమంలో తన సొంత ఇంటిని టిఆర్ఎస్ ఆఫీసుకు దానం చేశాడు తమ చివరి శ్వాస వరకు తెలంగాణ ఉద్యమం చేశారని,సిరిపురం యాదయ్య తెలంగాణ ఉద్యమంలోఅసెంబ్లీ ముట్టడిలో పోలీసులకు ఎదురొడ్డి ర్యాలీలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేశారు. పద్మశాలి టైగర్ ఆలే నరేంద్ర తెలంగాణ సాధన సమితి పార్టీని స్థాపించి ఉద్యమం చేసి టిఆర్ఎస్ తో జత కలిపి కేంద్ర మంత్రి పదవి కి రాజీ నామా చేసినాడు. అంతే కాకుండా శ్రీమతి వనం ఝాన్సీ రాణి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. వీరి త్యాగాలు విస్మరించరాదన్నారు. మనం చట్టసభల్లో ఉన్నట్లయితే మనకు రావాల్సిన హక్కులను మన సంక్షేమం కొరకు కొట్లాడవచ్చని అందుకే పద్మశాలి లందరూ చైతన్యమై ఒక తాటిపై నిలబడి ఐక్యత చాటుకోవాలని అదేవిధంగా వార్డు మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు ఆర్థిక స్తోమత కలిగిన పద్మశాలి కుల బంధువులు అందరూ పోటీ చేయడానికి ముందుకు రావాలని కోరారు.13న జరిగే మహాసభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలీలందరూ తమ ఇంటి శుభకార్యం అనుకొని పిడికిలి బిగించి పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శక్తిని ప్రదర్శించి రాజకీయ పార్టీలకు గుబులు పుట్టే విధంగా సభను విజయవంతం చేయాలని కోరారు. మనం సంఘటితం అయినప్పుడే తమ బలాన్ని చూసి అన్ని రాజకీయ పార్టీలు అనకు సీట్లను కేటాయిస్తారని అన్నారు.ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చలమల్ల నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షులు పిషిక వీరయ్య, మాజీ కౌన్సిలర్ గండూరి రమేష్, మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల శారద దేవి, జిల్లా కార్యదర్శి దూలం నగేష్, ఎంపీటీసీ పొన్నం వెంకన్న, మిర్యాల గోపాలకృష్ణ, యలగoదుల సుదర్శన్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మిట్ట కోల యుగంధర్, కస్తూరి కిషన్, పున్న వెంకన్న,బల్నే క్రాంతి కుమార్, యన్నం ఉమ శంకర్, కేతం వెంకటేశ్వర్లు, బిల్లా కేశవులు, కొంగరి ఉపేందర్, పగిడిమర్రి నాగేశ్వరరావు,కొక్కుల సంపత్,పులిపాటి వెంకటేశ్వర్లు, కడారి వెంకన్న,బొనదస్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: