Monday, 27 July 2026 02:33:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ అభివృద్ధి జరగాలంటే యువకులు ముందుకు రావాలి... - రాణా ప్రతాప్ రెడ్డి

Date : 14 September 2025 02:37 AM Views : 701

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట మండలం,ఇప్పల్ తండాకి చెందిన యువకులు బానోత్ సాగర్,బానోత్ నూతన్,ధరావత్ అనిల్,పితావత్ సునీల్,అజ్మీరా రాజుకుమార్,జాటోత్ నవీన్,ధరావత్ అఖిల్,ధరావత్ జగన్,బానోత్ లోకేష్,ధరావత్ సంజు,జాటోత్ సుమన్,బానోత్ ఈశ్వర్ గార్లు మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,సొనబోయిన సిద్దు గార్ల ఆధ్వర్యంలో,మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్ష్యంలో బిజెపి పార్టీలో చేరారు….ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ…. బిజెపి దేశంలో సాధిస్తున్న పురోగతి,జాతీయవాద సిద్ధాంతం నచ్చి,ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై,పేద - బడుగు-బలహీన వర్గాల కోసం అయన చేస్తున్న సేవను,తెలంగాణ రాష్ట్రంలో మోదీ గారిపై, బిజెపి పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గుర్తించి పార్టీలోకి విచ్చేస్తున్నారు..తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు,ఎంపీటీసీ, జడ్పిటీసీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది,ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వెనకడుగు వేస్తుంది.కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా,ఎదుర్కోవడానికి బిజెపి సిద్ధంగా ఉందని ,యువకులను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి గారు,జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి గారు,మండల ఉపాధ్యక్షులు బోయిని సుధాకర్,నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్ , జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పురాణీ దేవేందర్,సుమన్,లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు…

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :