సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం అర్బన్ టౌన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరని, ఎంతోమంది దేశభక్తులని తయారు చేసి బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన నేతాజీ శుభాష్ చంద్రబోస్ నేటి యువతరానికి గొప్ప ఆదర్శమైన వ్యక్తి అన్నారు. అయనబాటలో నేటి యువత దేశంకోసం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దొడ్డా అరుణ, జిల్లా ఉపాధ్యక్షులు బోయినపల్లి శేఖర్, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు యాకుబ్ పాషా, ప్రసాద్, సుగుణ రమేష్, రామారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
-----------------------
Admin