Sunday, 26 July 2026 08:01:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పకడ్బందీగా చేపట్టాలి...

Date : 30 April 2024 11:34 AM Views : 306

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలి జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. కలెక్టరేట్ కన్ఫెరెన్సు హాల్ లో నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం పోటీ లో నిలబడే అభ్యర్థుల ఖరారు కానుండడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మరింత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సువిద పర్మిషన్లు వెంటనే ఇవ్వాలని అలాగే అభ్యర్థులు కొన్ని వాహనాల పర్మిషన్లతో మరికొన్ని వాహనాలు ప్రచారం చేస్తే అట్టి వాహనాలు గుర్తించి కేసులు నమోదు చేయాలని తెలిపారు. దినపత్రికలు, సోషల్ మీడియా లలో వచ్చే వార్తలు, ప్రకటనలు గుర్తించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజక వర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సిబ్బందితో తరుచుగా మౌలిక వసతుల కల్పనపై సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిదంగా విలేజ్ పోలీస్ వాలంటారీ లు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలని, వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ అలాగే మెడికల్ శిబిరాలు ఉండాలని సూచించారు. వెబ్ క్యాస్టింగ్ నిర్దేశించిన ప్రాంతాలలో ఉండాలని అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ లలో ఉండాలని తెలిపారు. నల్గొండ, భువనగిరి లలో రెండేసి ఈ వి ఎం లు వినియోగం లో ఉన్నందున బి.యు లను మల్టిపుల్ ర్యాండమైజేషన్ చేపట్టాలని సూచించారు. క్రిటికల్ ప్రాంతాలలో పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎం.ఎల్.సి. ఎన్నికల నోటిఫికేషన్ మే 2 న విడుదల తో నామినేషన్ల స్వీకరణ 9న, 27 న పోలింగ్ , జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.తదుపరి యస్.పి. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీస్, సెక్టార్ అధికారులు కేంద్రాలను ముందుగా పరిశీలన చేయాలని సూచించారు. ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి బృందాలు అభ్యర్థుల సమావేశాలు అలాగే ర్యాలీలు వీడియో తీయాలని వాహనాల అనుమతులు పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే క్రిటికల్ ప్రాంతాలు, కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచామని సెక్టార్ అధికారులు, పోలీస్ సెక్టార్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు. ఎండ తీవ్రత పై అన్ని చర్యలు చేపట్టాలి. త్రాగునీటి సరఫరా పై ప్రజాభిప్రాయలను తీసుకోవాలి. జిల్లాలో తాగునీటి ఎద్దడిపై సమ్మర్ యాక్షన్ ప్రకారం పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో త్రాగునీటి ఎద్దడి చేపట్టవలసిన నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత లతో కలసి పాల్గొన్నారు. మే మాసంలో అధిక ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా మున్సిపల్, మండల అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిదంగా తహశీల్దార్లు, ఎంపీడీఓ , ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏ. ఈ అలాగే పంచాయతీ సెక్రెటరీలు చేపట్టే వివిధ పనుల యొక్క నిధులు మంజూరుకై అధికారుల సంతకాలు ఉండాలని సూచించారు. హుజూర్ నగర్, మేల్లచెర్వు, మఠంపల్లి మండలాల ప్రత్యేక అధికారులు త్రాగునీటి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సూర్యాపేట పట్టణం లోని 3,4,5 వార్డులలో త్రాగునీటి సమస్య కొంత ఉన్నందున మున్సిపల్ ట్యాంకర్స్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు. త్రాగునీటి పై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. మండల స్పెషల్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ లను పరిశీలించాలని. సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వర రావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, ఆర్.డి.ఓ వేణు మాధవ్, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, సి.పి.ఓ కిషన్, డి.ఎఫ్.ఓ రూపెందర్ సింగ్, డి.ఈ. ఓ అశోక్, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు ఈ డి ఎం గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: