Monday, 27 July 2026 08:48:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ సీనియర్ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు...

Date : 07 August 2023 11:50 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ సీనియర్ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఈ రోజు షాద్ నగర్ పట్టణంలోని సాయిరాజ పంక్షన్ హల్ లో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన అత్మయ సమ్మేళనం లో ఆయన పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు కూడా రక్త దాన శిభిరం కూడా నిర్వహించారు. అనంతరం జరిగిన జన్మదిన వేడుకల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు తదితరులు పాల్గొని శ్రీ వర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతం కోసం నా ప్రయాణం ప్రారంభమైందని, 33 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం అనే లక్ష్యంతో ఈ భరతమాత యొక్క వైభవాన్ని భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచంలో విశ్వ గురువు స్థానానికి చేరేవరకు నా ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. రాజకీయాలలోకి వస్తున్న అనేక మంది యువకులు నేడు రాజకీయాలంటే కేవలం కులం, డబ్బు అని ఏదైతే ఉందో అది అపోహ మాత్రమేనని, భారతీయ జనతా పార్టీలో 99 శాతం ఇప్పుడున్న నాయకులు కార్యకర్త స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగినటువంటి చరిత్ర ఉందని అన్నారు. ఎప్పటికైనా సిద్ధాంతం కోసం పని చేసిన వారే విజయం సాధిస్తారని, మనం మన వాణి ని ఆదర్శం గా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. నాలాంటి సామాన్యునికి కూడా పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందని అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటములను తట్టుకొని నిలబడాలంటే సిద్ధాంతం ఆధారంగా పనిచేసినప్పుడే ఓటమి తట్టుకునే శక్తి వస్తుందని అన్నారు. శ్రీ వర్ధన్ రెడ్డి గారి జీవితంలో కూడా గెలుపోవటములను నెమరు వేసుకుంటూ, ఎన్నో అవంతరాలు అవమానాలు జరిగినా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అనేక శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయని, వాటిని తట్టుకొని జాతీయ వాదాన్ని నింపాలి దేశాన్ని ఐక్యతగా ఉంచాలనె సిద్ధాంతం కోసం పరితపిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రతి పల్లెకు తీసుకు పోయే అవకాశం మిగతా కార్యకర్తలతో లభించింది అని అన్నారు. అయినా నా పోరాటం గెలుపోటములు కాదని, నా పోరాటం సిద్ధాంతం నిలబెట్టడం దాని కోసమే నా ప్రయాణమని, నా ఊపిరి ఉన్నంతవరకు కూడా సిద్ధాంతం కోసమే పనిచేస్తానని అన్నారు. ఈ సందర్బంగా దేపల్లి అశోక్ గౌడ్, భూపాల చారి, వంశీకృష్ణ, మల్చలం మురళి, చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, ప్యాట అశోక్, ఎంకనోళ్ల వెంకటేష్, పల్లె హన్మంత్ మాట్లాడుతూ శ్రీవర్ధన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా క్రమ శిక్షణ, నిబద్దత, సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తూ షాద్ నగర్ నియోజకవర్గం లో పల్లె పల్లెకు పార్టీ విస్తరింపజేసారని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, యువకులకు పార్టీ కార్యకర్తలకు నేనున్నా అని అండగా ఉన్నారని అన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా పని చేసి ఆ తరువాత నేను నాలుగు గోడల మధ్య నలభై మంది విద్యార్థులకు చదువు చెప్తే సరిపోదు, సమాజం లో లక్షలాది మందికి నా అవసరం ఉందని, సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ లోకి వచ్చారని గుర్తు చేశారు. గతంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారని, గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పాదయాత్ర లు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విష్ణువర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు నర్సింహా యాదవ్, మఠం ఋషికేష్, సుధాకరప్పా, కొమరబండ శ్రీశైలం, బోయ కురుమయ్య, నాగరాజు చారి, బోయ శంకర్ బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: