Monday, 27 July 2026 10:35:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో 1760 డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవం...

Date : 06 October 2023 09:46 AM Views : 245

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో 1760 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన ఆయన అనంతరం స్థానిక పత్తి మార్కెట్లో స్ధానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా 25 లక్షల విలువ చేసే ఇళ్లను నిరుపేదలకు పంచుతున్నామని వెల్లడించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ బాగుపడిందా, పాడయిందా అన్నది ప్రజలు గుర్తించాలన్నారు. 24 గంటల విద్యుత్, తాగునీరు రాష్ట్రానికి మేము అందించిన వరాలు అని అన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతు జీవితాలకు భరోసా కల్పించిన ఘనత తమ పార్టీదనే అన్నారు. సంక్రాంతి గంగిరెద్దులా ఎన్నికల వేలకు వచ్చే కాంగ్రెస్, బిజెపి నాయకులు ప్రజలకు చేసే మేలు ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటుతో వ్యవసాయం ఆగం అవుతుందన్నారు. చచ్చిన పీనుగల మారిన కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 2 వందలకంటే ఎక్కువ పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నాలుగు వేలు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములు ఇచ్చేది లేదు చచ్చేది లేదని వారి మాటలు నమ్మొద్దని హితవు చెప్పారు. త్వరలోనే కెసిఆర్ భారీ స్కీములు ప్రకటించబోతున్నారని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ విషయంలో ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం కొల్లాపూర్, ఉదండాపూర్, కరివేన, ఏదుల ,లక్నాపూర్ పనులు పూర్తి కాగానే మొదలవుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆందోళన చేసి కేసులు పెట్టిన నాయకులే ఇప్పుడు ప్రాజెక్టు గురించి అడగడం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు పార్టీలో ఉంటే పార్టీ సర్వనాశనం అవుతుందని వాళ్ల పార్టీ నేత అమరేందర్ సింగ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిజెపిలో చేరేందుకు టిఆర్ఎస్ ఆసక్తిగా ఉందంటూ మోడీ చెప్పడం చూస్తే నవ్వొస్తుందని, ఆ పార్టీతో కలిసి ఉండే దరిద్రం తమ పార్టీకి పట్టలేదని అన్నారు. అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పేదలే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలు ఆ గట్టున ఉంటారో, మా గట్టును ఉంటారో తెలుసుకోవాలని రంగస్థలం సినిమా పాటలు గుర్తుచేస్తూ స్పష్టం చేశారు. షాద్ నగర్ బహిరంగ సభ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని నిద్రలో కూడా మర్చిపోకుండా పనిచేసే ఉద్యమ నాయకుడు అంజయ్య యాదవ్ అని కొనియాడారు. పాలమూరు జిల్లాలో తొలిసారి ముఖ్యమంత్రి జడ్పిటిసి స్థానాన్ని గెలిచి పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనీ ప్రశంసించారు. ఇది నాకు ఎన్నికల సభలా కాకుండా అంజయ్య యాదవ్ విజయోత్సవ సభలా కనిపిస్తుందన్నారు. మళ్లీ అంజయ్య యాదవ్ వస్తాడని లక్ష్మీదేవి పల్లి నీటిని, పక్కా గృహాలను అందరికీ అందేలా చేస్తాడని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరిక మేరకు సిద్దాపూర్ లో 334 ఎకరాలలో ఐటి హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు మెట్రో రైలు ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. 4,669 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అంజయ్య యాదవ్ కావాలా.. అధికారం వస్తే అడ్డంగా దోచునే కాంగ్రెస్ నాయకులు కావాలా.. ప్రజలు తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రవీణ్, పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, చేవెళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇందిర, ఎంపీపీలు రవీందర్ యాదవ్, ప్రియాంక శివశంకర్ గౌడ్, జెడ్పిటిసి శ్రీలత, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ వెంకటరామిరెడ్డి, మైనార్టీ నేతలు సయ్యద్ సాదిక్, సర్వర్ పాష, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), నారాయణరెడ్డి, జాంగారీ రవి, రవి యాదవ్, ప్రేమలత యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :