సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సిపిఎం పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నందున సిపిఎం పార్టీ నుండి జిల్లా కార్యదర్శి రవి నాయక్ ను బహిష్కరణ చేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి హాజరైన ఆయన మాట్లాడుతూ గత మహాసభ నుండి పార్టీ పనిలో లేకుండా సొంత పనులు చేసుకుంటూ నేడు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూన్నందున పార్టీ నుండీ బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరపు పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపీ సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టేపు సైదులు, పాండు నాయక్, షేక్ యాకోబు హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోషణబోయిన హుసేన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాంబాబు పట్టణ నాయకులు శీలం శ్రీను, పాశం వెంకట నారాయణ,యలక సోమయ్య, రణమీయా, రామ్మూర్తి ,కొదటి సైదులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin