Sunday, 26 July 2026 06:07:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైల్వే ప్రహరీ గోడ, నివాసాల మధ్య అంబులెన్స్ పట్టే విధంగా దారి ఇప్పించండి. రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడు చంద్రశేఖర్ గౌడ్ కు వినతి పత్రం.

Date : 29 July 2023 06:13 AM Views : 507

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ మున్సిపాలిటీ 22వ వార్డులోని రైల్వే ప్రహరీ గోడ, నివాసాల మధ్య అంబులెన్స్ కు దారి ఇప్పించాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, షాద్ నగర్ పట్టణ మాజీ అధ్యక్షులు నడికూడ యాదగిరి యాదవ్ కాలనీవాసులతో కలిసి ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే సలహా మండలి సభ్యుడు డాక్టర్ కొండ చంద్రశేఖర్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. రైల్వే అధికారుల వ్యవహారంపై బాధితులు గతంలో, స్థానిక వాడు కౌన్సిలర్ నడి కూడా సరితా యాదగిరిని, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నడికుడ యాదగిరి యాదవ్ ను ఆశ్రయించారు. వారు స్పందించి, షాద్ నగర్ ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి అప్పుడు తీసుకువెళ్లారు. గతంలో సమస్య తాత్కాలికంగా పరిష్కరించబడింది. రైల్వే శాఖ అధికారులు, రతన్ కాలనీలో రైల్వే కోటర్స్ వెనకాల,కనీసం అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా రైల్వే ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని వివరించారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి సుమారు 40 కుటుంబాలు రైల్వే శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన కుటుంబాలు, ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. రైల్వే ప్రహరీ గోడ నిర్మాణం ఇండ్ల దగ్గరగా చేపట్టడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో వారు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుదన్నారు. రైల్వే ప్రహరీ గోడ, నివాసాల మధ్య కనీసం అంబులెన్స్ పోయేందుకు దారి ఇప్పించాలని కోరారు. రైల్వే ప్రహరీ గోడ, నివాసాల మధ్య అంబులెన్స్ పోయే విధంగా సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కృషి చేయాలని, రైల్వే డీజిఎంకు మా సమస్యను వివరించాలని మాకు తగు న్యాయం చేయాలని బాధితులతో కలిసి యాదగిరి యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు డాక్టర్ రామచంద్రయ్య, సాయిబాబా, కుమార్, చింత కొండపల్లి నర్సింలు, నజీర్ పాషా, హరిబాబు, విజయ, కమలమ్మ, సుశీల సాలమ్మ, ఉమాపతిరావు, లక్ష్మణ్, శీను తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: