సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండల కేంద్రంలో.. వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చెయ్యటానికి ముఖ్య అతిథులుగా.. ఎమ్మెల్సీ గౌడ్ విచ్చేసి, కమలాపూర్, మిట్టపల్లి తాండ,రాంపూర్ తదితర గ్రామాల్లో వరికోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వరిధాన్య కొనుగోలు కేంద్రాల భాగంగా.. ఉమ్మడి జిల్లాల ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ విజి గౌడ్ సందర్భంగా.. మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన రైతు భీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్ట్ వంటి మరెన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టాడని కొనియాడారు. వరి కొనుగోలు ఏ గ్రేడ్ రకానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ 2040 రూపాయలు నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెస్తే రైతుకు అనుకున్నంత గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. ప్రతి రైతు గ్రామ గ్రామాన దళారుల చేతిలో మోసపోవద్దని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, సకాలంలో డబ్బులు తమ అకౌంట్లో జమ అవుతాయని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి జడ్పిటిసి ఇందిరా లక్ష్మీ నరసయ్య, సొసైటీ డైరెక్టర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయకులు, పాల్గొన్నారు.
-----------------------
Admin