సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం ఆకుతోటపల్లిలో రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కోకర వెంకటరమణ తన రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ముగ్గురు కుమార్తెలు ఉండడంతో కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల చదువుల కోసం బయట అప్పులు చేశాడు. పంటలు పండక తీవ్ర నష్టాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక నిత్యం మదన పడుతుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తీవ్ర మనస్థాపానికి గురైన రైతు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-----------------------
Admin