సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు... ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భారత రాష్ట సమితి జిల్లా అధ్యక్షుడు పినపాక శాసనసభ్యుడు తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరియు బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆదేశాల మేరకు ఈరోజు బూర్గంపాడు మండలం మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి సారపాక 192 పోలింగ్ బూత్ లో సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణ ప్రభుత్వ పథకాలు తెలియ జేయటం జరిగింది మరియు అక్కడ వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తూ వారి పార్టీ యొక్క కరపత్రాలను అందజేయడం జరిగినది కార్యక్రమం ఉద్దేశించి కొనకంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ అందులో భాగంగా దళిత బంధు రైతు బంధు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం సహాయ నిధి వృద్ధాప్య, వితంతు పింఛన్ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ దేశానికే ఆదర్శం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సార పాక పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు , సారపాక పట్టణ యూత్ అధ్యక్షుడు లక్ష్మి చైతన్య రెడ్డి, మండల నాయకుడు చుక్కపల్లి బాలాజీ,యూత్ ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పంగి సురేష్, ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు సూది పాక ఈశ్వరరావు, మాల మహానాడు మండల అధ్యక్షుడు చెలికాని శివ, యూత్ నాయకుడు భూక్య కృష్ణ ,రాయల నరేంద్ర,భూక్య సురేష్, ములకలపల్లి ప్రసాద్ , దార్ల ప్రేమ్ కుమార్, భూక్య బద్రు ,షేక్ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin