సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : అకాల మరణం చెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు.మండలంలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన రావుల అంజి గౌడ్ (35) అనారోగ్యంతో పది రోజుల క్రితం మరణించారు. వృత్తిరీత్యా ఆటో మెకానిక్ అయిన తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయితే తమతో పాటు చదువుకున్న స్నేహితుడు మరణం పట్ల తోటి స్నేహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.చిన్న వయసులోనే తమని వదిలి వెళ్ళటాన్ని జీర్ణించుకోలేకపోయారు.వివిధ వృత్తి వ్యాపకాలలో ఉన్నవారు కలిసి 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. స్వర్గీయ తన స్నేహితుని కూతురి పేరున ఆ పైకాన్ని డిపాజిట్ చేయాలని సూచించారు.కష్ట కాలంలో సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులను గ్రామస్తులు,బంధువులు అభినందించారు.
-----------------------
Admin