సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : గాంధీనగర్ యువతను అభినందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య... పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారి స్ఫూర్తితో మూడు లక్షల విత్తనాలు సేకరించిన మిర్యాలగూడ గాంధీనగర్ యువత ను మిర్యాలగూడ నుండి ఖమ్మం వెళ్లి దరిపల్లి. రామయ్య జనమ్మ గారి దంపతులకు శాలువతో సన్మానం చేసి మొక్కను ఇవ్వడం జరిగింది. వనజీవి రామయ్య గారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ యువత పర్యావరణం కోసం, మొక్కలు నాటాలని, ప్రకృతిని కాపాడాలని, తను కూడా చిన్నతనం నుంచి మొక్కలు నాటడం విత్తనాలు సేకరించడం చేశానని, వివిధ ఔషధ మొక్కల గురించి, తెలియజేసి ఎక్కువ వేప,గానుగ,మర్రి,రాగి, పొగడ, నెరడు,చింత,వివిధ, మొక్కలు నాటాలని తెలియజేశారు. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే మొక్కలు టేకు, ఎర్రచందనం, అశ్వగంధ, వివిధ మొక్కలు కూడా నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవిరెండ్ల సందీప్ కుమార్, దైద .శ్రీనివాస్, దైద.కిరణ్, షేక్. రూహిద్,కందికంటి .విష్ణు , దైద. సాయినాథ్, కందికంటి .రాజశేఖర్, ఉబ్బపల్లి .పవన్, కందిగంటి. సైదులు, దైద.పవన్, కొత్తపల్లి మనీ. దేశం కోసం. ప్రకాష్, ఉపాధ్యాయుడు WEO. ఫౌండర్ షేక్ మహమ్మద్ పాషా, శ్రీరంగం సంపత్ గారు. పాల్గొన్నారు.
-----------------------
Admin