సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పోలీస్ శాఖ వారు తెలియజేయడమేమనగా... రాత్రి మరియు పగలు వేళలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన ప్రజలకు ఇబ్బంది కలిగించిన అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఎర్రగొండపాలెం ఎస్సై, పి, చౌడయ్య హెచ్చరించారు. అలాగే బైక్ సైలెన్సర్ తీసివేసిన, ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేస్తే అట్టి వారిపై కేసు నమోదు చేయబడును. డీజేలు పెట్టరాదని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనినా అనుమతులు తప్పనిసరి లేకుంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆనందంగా కలిసికట్టుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసు వారు తెలియజేశారు...
-----------------------
Admin