Monday, 27 July 2026 06:31:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రివర్స్‌ గేర్‌ బదులు ఫస్ట్‌ గేర్‌... ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు, ముగ్గురు మృతి

Date : 07 November 2023 08:20 AM Views : 204

సర్కార్ టీవీ న్యూస్ / విజయవాడ జిల్లా : విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో (Vijayawada) 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరణించినవారిలో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, బాలుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి గుంటూరు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా 12వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకొచ్చింది...దీంతో కండక్టర్‌తోపాటు అక్కడ ఉన్న మరో ఇద్దరు మరణించారు. పలువురు బస్సు కింద ఇరుక్కుపోయారు. తక్షణమే స్పందించిన సిబ్బంది.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్లాట్‌ఫామ్‌ 11, 12 వద్ద ఫెన్సింగ్‌, కుర్చీలు ధ్వంసమయ్యాయి. మృతులను బస్సు కండక్టర్‌ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనవడు అయాన్‌గా గుర్తించారు. కుమారి కోడలు సుకన్యకు కాలు విరిగిపోయింది. కాగా, డ్రైవర్‌ రివర్స్‌ గేరుకు బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు. బస్సు కండిషన్‌ బాగానే ఉందని వెల్లడించారు. ఇది మానవ తప్పిదమా లేదా సాంకేతిక తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, 24 గంటల్లోపు విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్‌ వయస్సు 61 ఏండ్లు అని, ఈ మధ్యే అనారోగ్యానికి గురై కోలుకుని డ్యూటీలో చేరాడని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :